Tirupati: జెండా వందనం చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి ఆనం

Tirupati: తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేస్తూ అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 11:14 AM IST
Tirupati
X

Tirupati: జెండా వందనం చేస్తూ కళ్లు తిరిగి పడిపోయిన మంత్రి ఆనం

Tirupati: తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.

పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మైక్ ముందు ప్రసంగిస్తుండగా కళ్లు తిరిగి పక్కకు వాలిపోయారు. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆయన్ను కింద పడకుండా పట్టుకున్నారు. వేదికపైనే ఉన్న వైద్య బృందం వెంటనే స్పందించి మంత్రికి ప్రాథమిక చికిత్స అందించింది.

వైద్యుల సకాలంలో అందించిన చికిత్సతో మంత్రి ఆనం కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరిగి స్వాతంత్ర్య వేడుకల కార్యక్రమంలో పాల్గొనడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story