Nellore: పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
Nellore: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Nellore: పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
Nellore: పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ తో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు మంత్రి ఆనం. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.
ఈనెల 27 నుంచి మే 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను త్వరలోనే రాష్ట్ర పండువగా ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఫెస్టివల్ కమిటీని నియమించామని, కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తమ ప్రభుత్వం విజయవంతంగా మహిళలకు ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ప్రవేశ పెట్టడం ద్వారా గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ఆర్టీసీ అధికారులు అధిక సంఖ్యలో బస్సులను నడపాలని నిర్ణయించామని చెప్పారు. విద్యుత్, పోలీస్, ఫైర్, మెడికల్, ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు భక్తుల అవసరాల మేరకు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
హనుమంతుని సేవ, గరుడ సేవ, కళ్యాణ ఉత్సవం ప్రధాన రోజుల్లో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తామని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
నిన్న సుమారు 3 గంటల పాటు దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపై కీలకమైన ఆదేశాలిచ్చారని తెలిపారు .రాష్ట్రంలోని ప్రతి ఆలయం పట్ల క్రమశిక్షణ, చిత్తశుద్ధి కలిగి ఉత్సవాలను,
బ్రహ్మోత్సవాలను భక్తుల విశ్వాసాల మేరకు నిర్వహించాలాన్న సీఎం చంద్రబాబు సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.




