Nellore: తరుణవాయి పడమటి పాలెంలో నేడు ప్రారంభోత్సవాల జాతర

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలంలో నేడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు.

M Satya Peter, Atmakur
Updated on: 2 May 2026 10:40 AM IST
Nellore
X

Nellore: తరుణవాయి పడమటి పాలెంలో నేడు ప్రారంభోత్సవాల జాతర

నెల్లూరు జిల్లా: సంగం మండలం తరుణవాయి, పడమటి పాలెం గ్రామాలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం రామనాథన్ రెడ్డి ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తరుణవాయి ఐటిఐ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్డు పనులు.. నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభోత్సవం చేస్తారు. ఇరిగేషన్ శాఖ పనులకు భూమి పూజ కార్యక్రమం చేస్తారు. అనంతరం సాయంత్రం 5.00 గంటలకు పడమటి పాలెం గ్రామంలో సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకం.. ప్రారంభోత్సవం నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం.. ఇరిగేషన్ శాఖ ద్వారా చేపట్టనున్న పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story