Nandyal: కొడవలి చేతబట్టిన మంత్రి: వేములపాడులో బీసీ జనార్ధన్ రెడ్డి శ్రమదానం!
Nandyal: నంద్యాల జిల్లా అవుకు మండలం వేములపాడులో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన.
Nandyal: కొడవలి చేతబట్టిన మంత్రి: వేములపాడులో బీసీ జనార్ధన్ రెడ్డి శ్రమదానం!
నంద్యాల జిల్లా: స్వచ్ఛంద్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం అవుకు మండలం వేములపాడు గ్రామంలో జలధార-జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. వేములపాడు గ్రామంలో చెరువు వద్ద ఉపాధి కూలీలతో కలిసి కొడవలి చేతబట్టి జమ్ము గడ్డి కోసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి . కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు శ్రమదానంలో భాగంగా వేములపాడు గ్రామంలో చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి. వేములపాడు గ్రామంలో ప్రజలతో కలిసి సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి చెరువు కట్టను పర్యవేక్షించిన మంత్రి గ్రామంలో పంట కాల్వకు వెళ్ళే తూము దెబ్బతిన్న విషయం తన దృష్టికి రావడంతో స్వయంగా వెళ్లి పరిశీలించిన మంత్రి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి చెరువు బాగు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి. గ్రామ ప్రజలు, అధికారులు, ఉపాధి హామీ కూలీలు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించిన మంత్రి. అనంతరం గ్రామంలో సంక్షేమ పథకాల అమలు - అభివృద్ధి కార్యక్రమాల పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న మంత్రి




