Atmakur: ఆనం ప్రతిపాదనలకు బీసీ జనార్దన్ రెడ్డి సానుకూల స్పందన!

Atmakur: ఆత్మకూరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధిపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి చర్చించారు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 14 April 2026 7:29 PM IST
Atmakur
X

Atmakur: ఆనం ప్రతిపాదనలకు బీసీ జనార్దన్ రెడ్డి సానుకూల స్పందన!

Atmakur: ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చేశారు. మంత్రి జనార్దన్ రెడ్డి గారికి పుష్పగుచ్చం అందజేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆత్మకూరు నియోజకవర్గం లోని పలు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల విషయమై సుదీర్ఘ చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ రెడ్డి శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం తన నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులకు సంబంధించిన పలు అంశాలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. మంత్రి రామనారాయణరెడ్డి ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరగాతిన ఆమోదింప చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు రోడ్ల విషయం ప్రస్తావించగా ఇవన్నీటిని మంత్రిగారు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story