Vizag: అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై మంత్రి సమీక్ష!

Vizag: విశాఖపట్నంలో గిరిజన సహకార సంస్థ (GCC)పై మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు.

ANIL, VIZAG CITY
Published on: 8 April 2026 8:39 PM IST
Vizag
X

Vizag: అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరపై మంత్రి సమీక్ష!

Vizag: విశాఖపట్నంలో GCC సమీక్షా సమావేశం: మంత్రి సంధ్యారాణి గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న Girijan Cooperative Corporation (GCC) సమీక్ష మంత్రి నిర్వహించారు. గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు, డి.ఆర్. డిపోలు సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు.

గిరిజనుల వద్ద కొనుగోలు చేసిన వస్తువులకు ఆన్ లైన్ ద్వారా డబ్బులు జమ చేయాలని, అప్పుడే పారదర్శకత పెరుగుతుందని సూచించారు. CM గారి వల్లే కాఫీ కి మంచి బ్రాండ్ వచ్చిందని, కాఫీ కొనుగోలు పెంచి రైతులను ప్రోత్సహించాలని కోరారు, ఈ సందర్భంగా GCCలో పనిచేస్తున్న 33 మంది సేల్స్ మెన్‌లకు జూనియర్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు మంజూరు చేశారు.

గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. గిరిజన కుటుంబాల ఆదాయాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో GCC చైర్మన్ కిడారి శ్రావణ్ గారు,MD శోభిక IAS గారు m, అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ANIL, VIZAG CITY

ANIL, VIZAG CITY

Next Story