Sri Sathya Sai: మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఫీడర్ ఛానల్ ప్రారంభం
Sri Sathya Sai: ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో 'జలధార' కార్యక్రమం. బూదనంపల్లి - చింతకుంట చెరువు ఫీడర్ ఛానల్ నిర్మాణానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ భూమిపూజ.
Sri Sathya Sai: మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఫీడర్ ఛానల్ ప్రారంభం
Sri Sathya Sai: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం బూదనంపల్లి గ్రామం, చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన VB–GRAM G మరియు జలధార (తాగునీరు & భూగర్భ జలాల పెంపుదల) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూదనంపల్లి నుండి చింతకుంట చెరువుకు ఫీడర్ ఛానల్ నిర్మాణ పనులు చేపట్టబడుతున్నాయి.యోగి వేమన రిజర్వాయర్ నుంచి బూదనంపల్లి చెరువుకు వచ్చే నీటిని ఈ ఫీడర్ ఛానల్ ద్వారా చింతకుంట చెరువుకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
దీంతో బోర్‌వెల్‌ల రీచార్జ్, పశువులకు తాగునీరు, సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. రైతులు తమ భూముల మీదుగా ఫీడర్ ఛానల్‌కు స్వచ్ఛందంగా అనుమతి ఇవ్వడం విశేషం. అలాగే వీర్ నిర్మాణం రాళ్ల తొలగింపు వంటి పనులతో మొత్తం సుమారు ₹25 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంపై రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రాంతానికి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.




