Chittoor: అంబేద్కర్ ఆశయాలే మనకు మార్గదర్శకం - ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
Chittoor: పలమనేరు నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందడి.
Chittoor: అంబేద్కర్ ఆశయాలే మనకు మార్గదర్శకం - ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
Chittoor: భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు పలమనేరులో మంగళవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, నేటి యువత ఆయనలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ వి బాలాజీ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నాగరాజు, నాయకులు కుట్టి,గిరిబాబు,సుబ్రహ్మణ్యం గౌడ్, చిన్ని, ఖాజా,బిఆర్సి కుమార్, పర్వీన్,పలమనేరు మండల నాయకులు నాగరాజు రెడ్డి, వెంకటముని రెడ్డి, గంగవరం నాయకులు సోమశేఖర్ గౌడ్, పల్లె రుచులు అమరనాథ రెడ్డి, రవి,గిరిధర్ గోపాల్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు..




