Bobbili: బొబ్బిలిలో మాజీ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
Bobbili: బొబ్బిలిలో మాజీ సర్పంచులు, కౌన్సిలర్లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే బేబీనాయన మరియు తెంటు లక్ష్మునాయుడు.
Bobbili: బొబ్బిలిలో మాజీ ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం
Bobbili: మాజీ సర్పంచులను మరియు మాజీ కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే బేబీనాయన,మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, సర్పంచులు మరియు కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గంలో సేవలందించిన ప్రజా ప్రతినిధులను ఈరోజు ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి పట్టణంలో ఉన్న లోకబంధు రెసిడెన్సీలో అందరినీ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ..వార్డు, గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలను తెలుసుకొని పనిచేయడం కష్టతరమని, అలాంటి భాద్యత తీసుకున్న మాజీ సర్పంచులను, మాజీ కౌన్సిలర్లను అభినందించారు. ఇటువంటి కార్యకర్తలను,నాయకులను పొందిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.వారందరూ పార్టీకి చేస్తున్న సేవకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ..వైసీపీ హయాంలో ఎన్నో ఒత్తిళ్లకు లోనై, ఖటిన పరిస్థితులలో కూడా పార్టీని వీడకుండా ప్రజలు మధ్య ఉండి సేవలు అందించారని కొనియాడారు. గత ప్రభుత్వ పాలనలో పరిపాలన నిర్వీర్యం అయిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి, మళ్లీ గాడిన పెడుతున్నామని గుర్తుచేశారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, కింద స్థాయి నాయకులే బలమని, వారి సేవలను పార్టీ ఎప్పటికి మర్చిపోదని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మన సత్తా మళ్లీ చాటాలని, ప్రజలకు నిస్వార్థ పరిపాలన అందించాలని సూచించారు. అనంతరం అందరికీ భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు.




