Kothapeta: రూ.12 కోట్లతో వాటర్ ట్యాంక్ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సత్య

Kothapeta: రూ.12 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ చేశారు. దీనితో కట్టుంగ, ర్యాలిలో తాగునీటి తిప్పలు తప్పుతాయి.

TRIMURTULU, KOTHAPETA
Published on: 29 July 2026 4:55 PM IST
Kothapeta
X

Kothapeta: రూ.12 కోట్లతో వాటర్ ట్యాంక్ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే సత్య

రూ.12 కోట్లతో నిర్మించనున్న మంచినీటి వాటర్ ట్యాంకుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ...

కట్టుంగ, ర్యాలి, నార్కేడిమిల్లి, అంకంపాలెం గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు తాగునీటి సౌకర్యం మెరుగుపరిచే లక్ష్యంతో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మంచినీటి వాటర్ ట్యాంకు నిర్మాణ పనులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ వాటర్ ట్యాంకు నిర్మాణం పూర్తయిన తర్వాత కట్టుంగ, ర్యాలి, నార్కేడిమిల్లి, అంకంపాలెం గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA