Srikakulam: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు.. ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ బాబు
Srikakulam: ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి పనులను రాష్ట్ర విప్ బెందాళం అశోక్ బాబు ప్రారంభించారు.
Srikakulam: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు.. ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ బాబు
Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంత అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సమానంగా చురుకుగా పాల్గొంటూ రాష్ట్ర విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు,జనసేన ఇన్చార్జి దాసరి రాజు గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నిర్వహించిన పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రిలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం పురుషోత్తపురం గ్రామంలో నిర్వహించిన షిర్డీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలసి కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఎమ్మెల్యే హాజరుతో కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కౌన్సిలర్లు, ఇంచార్జి కౌన్సిలర్లు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




