Malikipuram: రైతులకు భరోసా: రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

Malikipuram: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చేతుల మీదుగా మలికిపురం మండల రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ.

PRABHU, RAZOLE
Published on: 16 April 2026 11:02 AM IST
Malikipuram
X

Malikipuram: రైతులకు భరోసా: రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మలికిపురం (కోనసీమ జిల్లా): మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో ఎం జి గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్‌ లో మలికిపురం మండలానికి చెందిన రీ-సర్వే పూర్తయిన విశ్వేశ్వరాయపురం మరియు ఇరుసుమండ గ్రామాల రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.., భూ రీ-సర్వే ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ధారించబడతాయని, రైతులకు భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story