Malikipuram: మంచినీటి కష్టాలకు చెక్ రంగంలోకి దిగిన ఎమ్మెల్యే వరప్రసాద్
Malikipuram: మలికిపురం మండలం కేశనపల్లి ఇరిగేషన్ పథకంపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష. 3,000 ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించడమే లక్ష్యం.
Malikipuram: మంచినీటి కష్టాలకు చెక్ రంగంలోకి దిగిన ఎమ్మెల్యే వరప్రసాద్
మలికిపురం: మలికిపురం మండలం కేశనపల్లి గ్రామంలో కేశనపల్లి ఇరిగేషన్ పథకం పై రైతులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. కేశనపల్లి ఇరిగేషన్ పథకం ద్వారా మలికిపురం మండలంలోని గూడపల్లి, గూడపల్లి పల్లిపాలెం, పడమటిపాలెం, కేశనపల్లి, గొల్లపాలెం మరియు తూర్పుపాలెం గ్రామాలకు చెందిన సుమారు 3,000 ఎకరాలకు నూతన ఆయకట్టు ఏర్పాటు చేసి సాగునీరు మరియు త్రాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాలువల పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు, నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న చెత్త మరియు మట్టిని పూర్తిగా తొలగించే పనులు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రపరచి నీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కాలువల నుంచి తొలగించిన మట్టిని పాఠశాలలు, లోతట్టు ప్రాంతాలు మరియు అవసరమైన ప్రదేశాల్లో వినియోగించేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, రెవెన్యూ మరియు పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.
భవిష్యత్తులో మంచినీటి సమస్యలు తలెత్తకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అవసరమైతే నదుల అనుసంధానం వంటి అంశాలపై కూడా ఆలోచనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారు వెల్లడించారు. సముద్ర మట్టం పెరుగుదల, ఉప్పునీటి ప్రభావం వంటి అంశాలపై కూడా పరిశీలన కొనసాగుతోందన్నారు.
రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజలందరూ కలిసి పనిచేస్తేనే ఈ పథకం విజయవంతమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.




