Palakonda: మన రైతులకు నీరు అందాకే పక్క నియోజకవర్గాలకు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు
Palakonda: పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 'నీటి భద్రత - సాగు నీటి సంఘాల బాధ్యత' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Palakonda: మన రైతులకు నీరు అందాకే పక్క నియోజకవర్గాలకు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు
Palakonda: పాలకొండ మండల పరిషత్ ఆఫీస్ (ఎంపీడీఓ )ప్రాంగణం లో జల వనరుల శాఖ (నీటి భద్రత -సాగు నీటి సంఘాల భాధ్యత) అనే కార్యక్రమానికిని శ్రీ కారం చుట్టి నీటి సంఘాలు అధ్యక్షులు, మెంబెర్స్ తో సమావేశం అయిన పాలకొండ శాసన సభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు,
MLA నిమ్మక జయ క్రిష్ణ గారు మాట్లాడుతూ
నీటి భద్రత -సాగు నీటి సంఘాలు బాధ్యత 100 రోజులు ప్రోగ్రాం సందర్బంగా రైతులకు సంబంధించిన మధుములు,చెక్ డ్యామ్ లు, చెరువులు, సర్పల్స్ లు, డ్రాప్ లు ,సంబందించిన నియోజకవర్గం లో సదరు పనులను NREGS లో పూర్తి చేయాలనీ అధికారులును ఆదేశించారు.
సీతంపేట మండలం నకు సంబంధించిన నలినీ క్రిష్ణ సాగరం మరియు వీరఘట్టం మండలంలో వెంకన్న చెరువు ఆక్రమను గురై ఉన్న వాటిని క్లియర్ చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. అలాగే నీటి సంఘాలు అధ్యక్షులు సంగం ఆధ్వర్యంలో ఉన్న సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
పాలకొండ నియోజకవర్గం లో సాగు నీటి సమస్య భామిని మండలంలో వంశధార నాగావళి ప్రవాహం ఉన్న కూడా భామిని మండలానికి నీరు అందటం లేదు కనుక మా నియోజకవర్గం రైతుకి నీరు అందాకనే మిగతా వాళ్ళకి పంపించాలని అధికారులుకు ఆదేశించించారు.


