Amaravati: ఉంగుటూరులో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు ప్రారంభం!

Amaravati: అమరావతి ఛాంపియన్షిప్–2026 లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 29 July 2026 4:04 PM IST
Amaravati
X

Amaravati: ఉంగుటూరులో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడలు ప్రారంభం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్–2026లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఈరోజు నిడమర్రు మండలం చిననిండ్రకొలను జడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు జాతీయ జెండాను ఆవిష్కరించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాటు చేసిన వివిధ ఆటల మైదానాలను సందర్శించిన ఎమ్మెల్యే, ఒక్కో క్రీడా విభాగాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం కొన్ని క్రీడల్లో స్వయంగా పాల్గొని యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. క్రీడాకారులతో మమేకమై వారిని అభినందిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్షిప్–2026 యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రభుత్వం కల్పించిన సువర్ణ అవకాశమని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, అనంతరం రాష్ట్ర స్థాయిలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి యువ క్రీడాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ NDA కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు (PEDలు), ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story