Nellore: ఆస్తి హక్కు నుండి రిజర్వేషన్ హక్కు వరకు.. మహిళా ప్రస్థానం
Nellore: నెల్లూరులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విలేకరుల సమావేశం. నారీ శక్తి వందన్ అధినియం బిల్లుపై హర్షం.
Nellore: ఆస్తి హక్కు నుండి రిజర్వేషన్ హక్కు వరకు.. మహిళా ప్రస్థానం
Nellore: పార్లమెంటులో "నారీ శక్తి వందన్ అధినియం" బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రధాని మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీల పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లు భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం అని, స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులు తమ పాలనా దక్షతతో ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్నారని తెలిపారు.
చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం దేశాభివృద్ధికి శుభపరిణామం అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత యిస్తోందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కేంద్రంలోని ఎన్డిఎ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పెట్టనున్న నేపథ్యంలో తెలుగుదేశం, బిజెపి మరియు జనసేన మహిళా నాయకులతో కలిసి నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని ఆమె కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ..
మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్న ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. గతంలో నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు కల్పించి విప్లవాత్మక మార్పుకు నాంది పలికారని అదే బాటలో చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వావలంబనకు అడుగులు వేశారని ఆమె గుర్తుచేశారు.
స్థానిక సంస్థలు, ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ద్వారా సర్పంచులుగా, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు ఛైర్మెన్లుగా ఎన్నికైన మహిళా ప్రజా ప్రతినిధులు తమ పాలనా దక్షతతో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. పరిమిత వనరులతో కుటుంబాన్ని నడిపే నేర్పు ఉన్న మహిళలు, ప్రభుత్వ వనరులను కూడా వృధా కాకుండా ప్రజా ప్రయోజనాలకు మళ్లించడంలో మేటి అని నిరూపిస్తున్నారని అన్నారు.
నెల్లూరు జిల్లాలో సారా ఉద్యమాన్ని నడిపిన దూబగుంట రోశమ్మ స్ఫూర్తితో మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గుర్తుచేశారు. చట్టసభల్లో మహిళలు ఉంటే అట్టడుగు వర్గాల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా దేశ గమ్యాన్ని మార్చే నాయకులుగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం దేశాభివృద్ధికి శుభపరిణామమని పేర్కొంటూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.




