Nellore: అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం

Nellore: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పెళ్లకూరు రామచంద్ర రెడ్డి కాలనీలో రూ. 33 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 4:45 PM IST
Nellore
X

Nellore: అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం

Nellore: నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 33 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రజలకు అంకితం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు రామచంద్ర రెడ్డి కాలనీలో 33 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కేవలం 22 నెలల్లోనే కోవూరు పంచాయతీ పరిధిలో రూ.11 కోట్ల 10 లక్షల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story