MLC Ananthababu: అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు తీర్పు? ఉమ్మడి తూర్పుగోదావరిలో హైటెన్షన్!

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజమండ్రి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో అనంతబాబు అరెస్టుకు రంగం సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 24 April 2026 11:25 AM IST
MLC Ananthababu
X

MLC Ananthababu: అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు తీర్పు? ఉమ్మడి తూర్పుగోదావరిలో హైటెన్షన్!

MLC Ananthababu: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం ‘డోర్ డెలివరీ’ మరణం కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో ఈరోజు కీలక విచారణ జరగనుంది.

సాక్షులను బెదిరించడం ద్వారా అనంతబాబు బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుచరుల ద్వారా సాక్షులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, డబ్బు ఆశ చూపినట్లు కాకినాడ సర్పవరం పోలీసులు ప్రాథమికంగా గుర్తించి కేసు నమోదు చేశారు.

కేసు మలుపు తిరగడంతో గత మూడు రోజులుగా అనంతబాబు అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 30 లోపు ఈ కేసులో తుది తీర్పు రావాల్సి ఉండటంతో, విచారణ ప్రక్రియ వేగవంతమైంది.

అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీడీపీ ఎస్సీ సెల్, ఎమ్మార్పీఎస్ మరియు వివిధ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. బాధితులకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు నేడు బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తే, అనంతబాబుకు మళ్లీ జైలు శిక్ష తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story