Sakhinetipalli: మోరిపోడు విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంక్

Sakhinetipalli: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1983వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన ముప్పర్తి సత్య వివేక్.. కోనసీమ ముద్దుబిడ్డపై అభినందనల జల్లు.

PRABHU, RAZOLE
Published on: 1 Jun 2026 8:55 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: మోరిపోడు విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంక్

సఖినేటిపల్లి: డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామానికి చెందిన ముప్పర్తి సత్య వివేక్ ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షలో ఆల్ ఇండియా 1983వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను జాతీయ స్థాయిలో చాటుకున్నారు.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే ఈ అత్యంత కఠినమైన పరీక్షలో విశిష్ట ర్యాంక్ సాధించడం ద్వారా సత్య వివేక్ కుటుంబ సభ్యులకు, గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి, నిరంతర శ్రమ, లక్ష్యసాధనపై దృష్టి మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి కారణమని ఆయన సన్నిహితులు తెలిపారు.

సత్య వివేక్ సాధించిన ఈ ఘన విజయంపై గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో భారతదేశానికి సేవ చేసే ఉన్నత స్థాయి ఇంజనీర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.

మోరిపోడు గ్రామం నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన సత్య వివేక్ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story