Kurnool: సీఎం చంద్రబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు ఎంపీ
Kurnool: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.
Kurnool: సీఎం చంద్రబాబుకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు ఎంపీ
Kurnool: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసిన ఎంపీ నాగరాజు,సీ.ఎం కి బర్త్ డే విషెస్ తెలిపారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన చొరవ చూపారని, రాజధాని మార్పునకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అనిశ్చితి లేకుండా ఉండటానికి ఆయన జాతీయ స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారన్నారు.. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్న ఎంపీ, చంద్రబాబు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆయన ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు..




