Nellore: సేవే మార్గం.. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం.. వేమిరెడ్డి

Nellore: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేట గిరిజన విద్యార్థులతో వేమిరెడ్డి దంపతులు సందడి చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 19 April 2026 8:55 PM IST
Nellore
X

Nellore: సేవే మార్గం.. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం.. వేమిరెడ్డి

Nellore: ప్రజాసేవకు, నిస్వార్థ రాజకీయం తోడై.. పదవుల కోసం కాకుండా పదిమందికి మేలు చేయాలనే తపనతో, సేవ చేయాలనే ఆశతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం. అందుకే ఆయన జన్మదినం సందర్భంగా ఇందుకూరుపేటలో ఉన్న గిరిజన విద్యార్థులకు టీషర్ట్స్‌, ప్యాంట్స్‌, షూస్‌, క్రీడా కిట్లు అందించి వారిని ప్రోత్సహించారు వేమిరెడ్డి దంపతులు.

ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా అనిల్‌ గార్డెన్స్‌లో గిరిజన విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారితో సరదాగా కొద్దిసేపు గడిపి వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. గిరిజన విద్యార్థుల పట్ల ఆయన చూపించిన ఔదార్యం సేవా తత్పరతకు అద్దం పడుతోంది. గిరిజన బిడ్డలు చదువులోనే కాదు సరైన ప్రోత్సాహం అందిస్తే క్రీడల్లో కూడా రాణించి అద్భుతాలు సృష్టించగలరన్నారు.

భవిషత్తులో ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు ఏ అవసరమొచ్చినా తాను ఆదుకుంటామని చెప్పారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి లు, తమ పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని విలువైన క్రీడా సామగ్రి అందచేయడం పట్ల గిరిజన విద్యార్థులు ఆనంద పరవశులయ్యారు. తమ గురించి ఇంతలా పట్టించుకున్న నాయకుడిని చూడటం ఇదే తొలిసారి అని వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story