Chintoor: ప్రచారం ముగిసింది తెర వెనుక ‘తాయిలాల’ పర్వం షురూ!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ పరిధిలోని 39 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ స్థానాలకు ముగిసిన ఎన్నికల ప్రచారం. పోలింగ్ రాత్రి ఓటర్ల ప్రలోభాలపై అధికారుల నిఘా, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలని హెచ్చరిక.
Chintoor: చింతూరు ఏజెన్సీలో ముగిసిన ఎన్నికల ప్రచారం!
Chintoor: చింతూరు ఏజెన్సీలో మంగళవారంతో ఎన్నికల ప్రచార సందడి ముగిసింది. గత కొన్ని రోజులుగా మైకులు, డప్పులు, ర్యాలీలతో హోరెత్తించిన నేతలు ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది.పోలింగ్ కు ముందు రాత్రి అత్యంత కీలకం. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రచారంలో ఇచ్చిన హామీలు ఒక ఎత్తు అయితే, చీకటి పడ్డాక ఇచ్చే ‘తాయిలాలు’ మరో ఎత్తు అని ఏజెన్సీలో చర్చ జోరుగా సాగుతోంది.మద్యం ఏరులై పారనుందా? నోట్ల కట్టలు చేతులు మారనున్నాయా? అంటూ జనంలో ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ గెలుపే లక్ష్యంగా నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల పరిధిలో మొత్తం 39 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఈ చివరి రాత్రి ఎటు మలుపు తిప్పుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.




