Nara Brahmani: భార్య సాధించిన ఘనతపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Nara Brahmani: హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రతిష్ఠాత్మక 'ఫార్చ్యూన్ ఇండియా' టాప్-100 అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 July 2026 10:19 AM IST
Nara Brahmani
X

Nara Brahmani: భార్య సాధించిన ఘనతపై నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Nara Brahmani: ప్రముఖ వ్యాపారవేత్త, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన 100 ప్రభావవంతమైన మహిళలు జాబితాలో ఆమె స్థానం దక్కించుకన్నారు. కార్పొరేట్ రంగంలో తన నాయకత్వం, వినూత్న ఆలోచనలు, సంస్థ అభివృద్ధిలో పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఫార్చ్యూన్ ఇండియా అత్యంత ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం ఎంతో గర్వంగా ఉందనీ. మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, నాయకత్వాన్ని చాటుతూ, కొత్త అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను" అంటూ అభినందనలు తెలిపారు.

హెరిటేజ్ ఫుడ్స్ అభివృద్ధిలో నారా బ్రాహ్మణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగం, డిజిటల్ మార్పులు, నాణ్యత ప్రమాణాలు, రైతులతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వ్యాపార విస్తరణ వంటి అంశాల్లో ఆమె నాయకత్వం సంస్థకు కొత్త దిశను చూపించింది. ఆమె నేతృత్వంలో హెరిటేజ్ ఫుడ్స్ దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించడమే కాకుండా వినియోగదారుల విశ్వాసాన్ని కూడా పెంచుకుంది.

ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించే ఈ జాబితా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి సత్కరిస్తుంది. పరిశ్రమలు, వ్యాపారం, సాంకేతికత, ఆర్థిక రంగం, స్టార్టప్‌లు, సామాజిక సేవ తదితర విభాగాల్లో ప్రభావం చూపుతున్న మహిళలకు ఈ గుర్తింపు లభిస్తుంది. ఈ జాబితాలో చోటు దక్కడం వ్యక్తిగత విజయమే కాకుండా ఆమె నాయకత్వ సామర్థ్యానికి, సంస్థ నిర్వహణలో చూపిన ప్రతిభకు నిదర్శనంగా భావిస్తున్నారు.

నారా బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, టీడీపీ నాయకులు, హెరిటేజ్ ఉద్యోగులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని నారా అభిమానులు,టిడిపి పార్టీ నేతలు,కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.


Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story