Nara Lokesh: తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం.. వీడియోలు ఎడిట్ చేసేవారికి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
Nara Lokesh: సీఎం చంద్రబాబు నాయుడు వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అసలు నిజమేంటో వివరిస్తూ, తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Nara Lokesh: తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం.. వీడియోలు ఎడిట్ చేసేవారికి మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని వక్రీకరించి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం వీడియోలను ఎడిట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మార్చి 30న తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ జరిగిన రెండు వేర్వేరు సంఘటనలను కలిపి కొందరు తప్పుడు వీడియోలు సృష్టించారని లోకేష్ వివరించారు.
ముక్కర అంబిక అనే లబ్ధిదారురాలి భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకున్న సీఎం, ఆయన జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను ఇప్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదే సమయంలో మరో మహిళ తన చదువుకున్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు.
దురుద్దేశపూర్వకంగా కొందరు ఈ రెండు ఘటనలను ఎడిట్ చేసి, "చదువుకున్న యువకుడికి ఉద్యోగం అడిగితే.. ఆటో కొనిస్తానని సీఎం అన్నట్లుగా" అపహాస్యం చేస్తూ ప్రచారం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చినప్పటికీ, మళ్లీ అదే తప్పును వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తోందని ఆయన విమర్శించారు.
"వైసీపీ తన తప్పుడు ప్రచారాల అలవాటును మార్చుకోవడం లేదు. వీడియోలను ఎడిట్ చేసి అసత్యాలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని లోకేష్ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




