Nara Devansh: ఇదిగో నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానల్... చూసేయండి ఓసారి
Nara Devansh: నారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాంశ్ సరికొత్త అవతారమెత్తాడు.
Nara Devansh: ఇదిగో నారా దేవాంశ్ యూట్యూబ్ ఛానల్... చూసేయండి ఓసారి
Nara Devansh: నారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాంశ్ సరికొత్త అవతారమెత్తాడు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిని ఏలిన జీవుల రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఊహించని విధంగా డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెడుతూ దేవాంశ్ ప్రారంభించిన సరికొత్త ప్రయాణం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘డైనో డీట్స్’ ఛానెల్ ప్రారంభం
నారా దేవాంశ్ ‘డైనో డీట్స్’ (Dino Deets) పేరుతో అధికారికంగా ఒక సరికొత్త యూట్యూబ్ ఛానెల్‌ను, పాడ్‌కాస్ట్ ప్రారంభించాడు. ఈ అద్భుతమైన డిజిటల్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన దేవాంశ్కు నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యేకంగా అభినందనలు , శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమ ఆరంభంలో తండ్రి నారా లోకేశ్ స్వయంగా పాల్గొని, ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు , ధ్వని ప్రసారాలకున్న ప్రత్యేకతలను, సాంకేతికతను ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం విశేషం.
https://www.youtube.com/watch?v=BveInXp8jBY
నవ్విస్తూ.. ఆలోచింపజేసే ప్రాచీన ప్రపంచం
పూర్వకాలంలో భూమిపై నివసించిన డైనోసార్లు, నాటి జీవుల శిలాజాలు, శతాబ్దాల నాటి పురాతన అవశేషాల గురించి దేవాంశ్ ఎంతో పరిశోధన చేశాడు. తాను తెలుసుకున్న ఆశ్చర్యకరమైన నిజాలను, అంతరించిపోయిన ప్రాచీన ప్రపంచపు వింతలను అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునే శైలిలో ఈ ఛానెల్ ద్వారా అందించనున్నాడు. నవ్విస్తూనే, ఆలోచింపజేసేలా సాగే దేవాంశ్ సరికొత్త ప్రపంచంలోకి తాను కూడా ఒక సాధారణ ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రపంచ రికార్డుల విజేత ఈ నారా వారసుడు
యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవాంశ్ కేవలం చదువులోనే కాకుండా మేధోపరమైన ఆటల్లోనూ తన ప్రతిభను చాటాడు. చదరంగంలో అత్యంత క్లిష్టమైన నూట డెబ్బై ఐదు పజిల్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా గతంలోనే ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాడు. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ అనే ప్రసిద్ధ పుస్తకంలోని సంక్లిష్టమైన చదరంగ సమస్యలను వేగంగా ఛేదించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దేవాంశ్, ఇప్పుడు విజ్ఞానాన్ని పంచేందుకు సామాజిక మాధ్యమాల్లోకి రావడం విశేషం.
దేవాంశ్ అందిస్తున్న ఈ విజ్ఞాన భరితమైన, ఆసక్తికరమైన సమాచారాన్ని వీక్షించాలనుకునే వారు క్రింది అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా అనుసరించవచ్చు.




