Parvathipuram Manyam: ఎండిన ఆయకట్టుకు జీవం.. పూడిక తీతతో నరసింహసాగరం కళకళ
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో సాగునీటి కష్టాలకు చెక్! నరసింహసాగరం చెరువు పునరుద్ధరణతో 204.5 ఎకరాలకు సమృద్ధిగా నీరు.
Parvathipuram Manyam: ఎండిన ఆయకట్టుకు జీవం.. పూడిక తీతతో నరసింహసాగరం కళకళ
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ మండలం వెలగవాడ పంచాయతీ పరిధిలోని నరసింహసాగరం చెరువు నీరు లేక సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతంగా నిలిచింది. వర్షాలు కురిసినా నీరు నిల్వ కాకపోవడం, చెరువులు పూడికతో నిండిపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. దాదాపు 204.5 ఎకరాల ఆయకట్టు భూమి సాగుకు దూరమై, రైతుల జీవనం కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని మార్చేందుకు జిల్లా యంత్రాంగం ఉపాధి హామీ పథకం సమన్వయంతో నరసింహసాగరం ట్యాంక్ పునరుద్ధరణ పనులను చేపట్టనుంది. చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. ఫీడర్ ఛానల్స్‌ను శుభ్రపరచి ప్రధాన వనరుల నుంచి నీరు సులభంగా చేరేలా, అదనపు నీరు సురక్షితంగా వెళ్లేందుకు మిగులు కాలువలను అభివృద్ధి, చెరువు హద్దులను కాపాడుతూ ఆక్రమణలను నివారణ.
ఈ చర్యల ఫలితంగా గ్రామంలో ఆశాజనక మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఇప్పుడా 204.5 ఎకరాల ఆయకట్టు భూమికి సమృద్ధిగా సాగునీరు అందండతో ఎండిపోయిన పొలాలు పచ్చని పంటలతో కళకళలాడనున్నాయి. చెరువులో నీటి నిల్వ పెరగడంతో భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లు నిండుతాయి. తాగునీటి సమస్య కూడా తీరనుంది. నీటి లభ్యత పెరగడంతో రైతులు ఇప్పుడు ఏడాదికి రెండు పంటలు పండించే స్థాయికి చేరుకునున్నారు. చెరువు పూడికను గట్లపై వేసుకోవడం వల్ల నేల సారవంతత పెరిగి, ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడి పెరిగనుంది. నీటి నిల్వే రైతుకు బలం అనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం, ఒక చెరువు పునరుద్ధరణకే పరిమితం కాకుండా గ్రామంలోని వందలాది రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే గొప్ప విజయగాథగా నిలిచింది. ప్రభుత్వ చర్యల పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




