Vizag: మహిళా సాధికారతకు రిజర్వేషన్ బిల్లు ఒక మైలురాయి

Vizag: విశాఖపట్నంలో నారీ శక్తి వందన్ సమ్మేళనం కార్యక్రమాన్ని వీక్షించిన పి.వి.ఎన్ మాధవ్.

GOPI, PENDURTHI
Published on: 13 April 2026 7:53 PM IST
Vizag
X

Vizag: మహిళా సాధికారతకు రిజర్వేషన్ బిల్లు ఒక మైలురాయి

Vizag: దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “నారీ శక్తి వందన్ సమ్మేళనం” కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi కీలక ప్రసంగం చేశారు. మహిళల రాజకీయ, సామాజిక సాధికారతకు ఈ బిల్లు మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు.

దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని, వారికి రాజకీయ రంగంలో సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాధవ్ అన్నారు. మహిళా శక్తిని మరింత బలోపేతం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

మహిళల సాధికారతే దేశ పురోగతికి మూలస్తంభమని, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ దిశగా మరింత బలమైన అడుగులు వేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story