Polavaram: జాతీయ రహదారి పనుల్లో కార్మికుల భద్రత గాలికి!
Polavaram: జీలుగుమిల్లి-పోలవరం జాతీయ రహదారి పనుల్లో కార్మికుల భద్రతను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి.
Polavaram: జాతీయ రహదారి పనుల్లో కార్మికుల భద్రత గాలికి!
Polavaram: జీలుగుమిల్లి–పోలవరం, దొండపూడి నుంచి రేపల్లివాడ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి–365 BB పనుల్లో కార్మికుల భద్రతపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా హెల్మెట్లు, చేతి తొడుగులు, భద్రతా షూలు, రక్షణ కళ్లజోళ్లు తదితర భద్రతా పరికరాలు అందించాల్సి ఉన్నప్పటికీ, కొందరు కార్మికులు కనీసం తలపై హెల్మెట్లు కూడా లేకుండానే పనులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో పనిప్రదేశాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా దొండపూడి పరిసర ప్రాంతాల్లో ఇనుప రాడ్లతో నిర్మాణ పనులు చేపడుతున్న చోట మరింత జాగ్రత్తలు అవసరం. ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఇనుప రాడ్లను సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా కట్ చేయడం, వాటి చివరలను రక్షణ కవర్లతో కప్పకపోవడం వల్ల కార్మికులకు రాడ్లు గుచ్చుకునే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. అలాగే పనిప్రదేశంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు




