Nellore: నెల్లూరులో మానవత్వానికి మారుపేరుగా 'స్మైల్' పునరావాస కేంద్రం!

Nellore: నెల్లూరులో బిచ్చగాళ్ల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రం 'స్మైల్' ప్రారంభం. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

V. Narasimhulu, Nellore
Updated on: 20 April 2026 12:25 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో మానవత్వానికి మారుపేరుగా 'స్మైల్' పునరావాస కేంద్రం!

Nellore: రోజురోజుకీ పెరుగుతున్న ఎండ తీవ్రతతో.. ఏసి రూముల వైపు ప్రజలు పరుగులు తీస్తున్న వేళ.. ఇల్లు వాకిళ్లు ఫ్యాన్లు ఏసీ గదులు ఉన్న మన పరిస్థితి ఇలా ఉంటే‌.. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ కనీసం చెట్టు నీడ దొరికిన చాలు అనుకుని బిక్కు బిక్కు మంటూ బ్రతికే బిచ్చగాళ్ళ పరిస్థితి మరి ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఊహించగలమా..?

చలికి వణుకుతూ, కప్పుకోవడానికి కనీసం దుప్పటి కూడా లేక ఒంటినిండా కట్టుకోవడానికి గుడ్డ కూడా లేకుండా అవస్థలు పడే బిచ్చగాళ్ళ జీవితాల్లోకి ఒక్కసారి మనం తొంగి చూడగలిగితే వారి దమనీయస్థితి మనకి అర్థం అవుతుంది.. అలాంటివారు కనీసం తలదాచుకోవడానికి అయినా ఓ గూడు కావాలనే బృహత్తరమైన ఆలోచనతో .. నగరపాలక సంస్థ సౌజన్యంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా "స్మైల్ బిచ్చగాళ్ళ పునరావాస కేంద్రాన్ని" ఈరోజు ప్రారంభించారు.

స్థానిక 38 డివిజన్ కూరగాయల మార్కెట్ వెనుక వద్ద నగరపాలక సంస్థ సౌజన్యంతో ఏ ఆర్ డి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్మైల్ బిచ్చగాళ్ళ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వై ఓ నందన్, తెలుగుదేశం నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి,ళ స్థానికులు తదితరులు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story