Nellore: జనాభా గణన శిక్షణా తరగతులపై కమిషనర్ పర్యవేక్షణ
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహిస్తున్న జనాభా గణన శిక్షణా తరగతులను కమిషనర్ వై.ఓ.నందన్ పరిశీలించారు.
Nellore: జనాభా గణన శిక్షణా తరగతులపై కమిషనర్ పర్యవేక్షణ
Nellore: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక వైఎంసి ప్రాంగణంలోని వి.ఆర్ పిజి కాలేజీలో నేటి నుంచి మూడు రోజులపాటు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు (వార్డు సచివాలయ కార్యదర్శులు) జరగనున్న జనాభా గణన శిక్షణ తరగతుల నిర్వహణ తీరును స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల అదనపు కమిషనర్ హిమబిందు, సెన్సెస్ ప్రత్యేక అధికారి రాజేంద్రప్రసాద్ లతో కలిసి గురువారం పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..
నేటి నుంచి ప్రారంభమయ్యే స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) జనాభా గణన శిక్షణలో కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. స్వీయ నమోదు కార్యక్రమం ద్వారా ఇంటింటి జనాభా సేకరణకు అవసరమైన పరిజ్ఞానంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవచ్చని కమిషనర్ సిబ్బందికి సూచించారు.
జనాభా గణన ప్రశ్నావళి వివరాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని మే నెల 1వ తేదీ నుంచి జరగనున్న ఇంటింటి జనాభా సేకరణ, ఇండ్ల జాబితా సర్వేను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కమిషనర్ సూచించారు.
జనాభా గణన స్వీయ నమోదుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన se.census.gov.in వెబ్ లింకు ద్వారా ఆన్లైన్లో ప్రశ్నావళిని పూర్తి చేసి వివరాలను నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మూడు రోజుల పాటు అందించనున్న శిక్షణలో పూర్తిస్థాయి జనాభా గణన అంశంపై అవగాహన పెంచుకొని సర్వేలో ఉన్నత ప్రతిభ కనబరచాలని, ప్రజల నుంచి సంపూర్ణ సహకారంతో వారి పూర్తి వివరాలను సేకరించాలని కమిషనర్ సూచించారు.




