Nellore: ఎస్పీ ఆదేశంతో కార్డన్ సెర్చ్.. నేరస్థులకు పోలీసుల హెచ్చరిక
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలదిబ్బ గ్రామంలో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Nellore: ఎస్పీ ఆదేశంతో కార్డన్ సెర్చ్.. నేరస్థులకు పోలీసుల హెచ్చరిక
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, జిల్లా పోలీస్ అధికారులకు కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లపై జారీ చేసిన ఆదేశాల మేరకు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను మరింత ప్రభావవంతంగా నిర్వహిస్తూ, ప్రజల్లో సానుకూల భావన కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. డిజిటల్ మ్యాపింగ్ ద్వారా క్రైమ్ స్పాట్స్ గుర్తింపు, రౌడీషీటర్లు, అనుమానితులు, పరారీ నిందితులు, NBWs/సమన్లు, గంజాయి & ఇతర నిషేధిత పదార్థాలు, వాహనాలు మరియు అక్రమ ఆయుధాలపై ప్రత్యేక దృష్టి సారించబడుతోంది.
ఈ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్, కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మలదిబ్బ గ్రామం హైస్కూల్ ఏరియాలో, కోవూరు CI గారి నేతృత్వంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో కోవూరు సిఐ తో పాటు , కృష్ణపట్నం సిఐ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు కొడవలూరు PS, విడవలూరు PS, ముత్తుకూరు PS, కోవూరు PS, కృష్ణపట్నం PS, పొదలకూరు PS మరియు ఇందుకూరుపేట PSలకు చెందిన అధికారులు, మొత్తం 40 మంది సిబ్బందితో కూడిన బృందం పాల్గొన్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా సుమారు 300 ఇళ్లను తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 23 టూ-వీలర్స్ మరియు 1 ఆటోను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు సస్పెక్ట్ షీటర్లను గుర్తించి, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, భవిష్యత్తులో నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపించారు.
అదేవిధంగా అక్కడి ప్రజలకు స్థానిక సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు మరియు బాలల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగం నివారణపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు.
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌ను విస్తృతంగా కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.




