Nellore: రౌడీ షీటర్లకు ఎస్పీ అజిత వేజెండ్ల సీరియస్ వార్నింగ్!
Nellore: నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
Nellore: రౌడీ షీటర్లకు ఎస్పీ అజిత వేజెండ్ల సీరియస్ వార్నింగ్!
Nellore: జిల్లాలో గత కొంతకాలంగా పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల దృష్ట్యా, నేరచరిత్ర కలిగిన రౌడీ షీటర్ల పై దృష్టి సారించారు జిల్లా ఎస్పీ...ప్రవర్తన మార్చుకొని పరివర్తన చెందాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే రౌడీషీటర్లను క్షమించేది లేదని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ.
నేర ప్రవృత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించేది లేదని, తప్పు చేయాలంటే ఎవరైనా భయపడేటట్లు కఠినమైన, చట్టపరమైన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీ షీట్స్ ఓపెన్ అయినా రౌడీ షీటర్లందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు... ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకుని మంచి మార్గంలో నడవాలని లేదంటే చట్టం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు.
నెల్లూరు జిల్లా ప్రశాంతతకు మారుపేరని గత కొంతకాలంగా కొన్ని సంఘటనలతో ప్రజల్లో కలిగిన భయాందోళన పోగొట్టేలా పోలీసు అధికారులు పనిచేస్తారని, ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల.




