Nellore: ఎస్పీ కాల్స్ ప్రభావం.. సిబ్బంది కోరుకున్న చోటే పోస్టింగులు
Nellore: నెల్లూరు జిల్లాలో ఐదు ఏళ్ల సేవా కాలం పూర్తి చేసుకున్న 212 మంది పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా బదిలీలు నిర్వహించారు.
Nellore: ఎస్పీ కాల్స్ ప్రభావం.. సిబ్బంది కోరుకున్న చోటే పోస్టింగులు
Nellore: నెల్లూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఐదు సంవత్సరాల సేవా కాలం పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ నుండి, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు మరియు యస్పి సంపర్క్ కాల్స్ ద్వారా రిసీవ్ కాబడిన అభ్యర్థునల మేరకు మొత్తం 212 మంది పోలీసు సిబ్బందికి, ఈ రోజు తేది 18 ఏప్రిల్ 2026న జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్.పి. డాక్టర్ అజితా వెజెండ్ల ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు.
ఈ బదిలీల ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) సిహెచ్ సౌజన్య సమర్థవంతంగా సమన్వయం చేసి, అన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించి, సిబ్బంది అభ్యర్థనలు మరియు అవసరాలను పరిశీలిస్తూ పారదర్శక విధానంలో నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ప్రక్రియలో ఆయా పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా, అర్హత కలిగిన సిబ్బందికి వారు కోరుకున్న ప్రదేశాలలో నియామకాలు కల్పించబడినట్లు అధికారులు తెలిపారు. బదిలీల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించబడటంతో సిబ్బందిలో సంతృప్తి వ్యక్తమైంది.
ఈ సందర్భంగా బదిలీలలో పాల్గొన్న పోలీసు సిబ్బంది, తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని పారదర్శకంగా బదిలీల ప్రక్రియ నిర్వహించినందుకు జిల్లా ఎస్.పి. డాక్టర్ అజిత వేజెండ్ల మరియు అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) సిహెచ్ సౌజన్య కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి. అజిత వేజెండ్లతో పాటు అడిషనల్ ఎస్.పి. (అడ్మిన్) సిహెచ్ సౌజన్య, టౌన్ ఏ.ఎస్.పి./ఎస్.డి.పి.ఓ శ్రీమతి దీక్ష, ఎస్.బి. డి.ఎస్.పి.వి. ధీరజ్ వినిల్, ఆత్మకూరు SDPO, ఏ.ఓ చంద్రమౌళి గారు, సూపరింటెండెంట్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




