Nellore: జలం లేక జీవం లేదు.. నీటి సంరక్షణ అందరి బాధ్యత

Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల నేతృత్వంలో 'జలం-జీవం' కార్యక్రమం ఘనంగా జరిగింది.

V. Narasimhulu, Nellore
Published on: 18 April 2026 5:12 PM IST
Nellore
X

Nellore: జలం లేక జీవం లేదు.. నీటి సంరక్షణ అందరి బాధ్యత

Nellore: "స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమము నిర్వహించారు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల. ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా నేడు ఏప్రిల్ 3 వ శనివారం 'జలం - జీవం' అనే అంశంపై జిల్లా యస్.పి. అజిత వేజెండ్ల పోలీసు కార్యాలయం నందు ప్రతిజ్ఞ చేయించి, ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా యస్.పి. మాట్లాడుతూ..

జలం లేక జీవం లేదు –ప్రతి నీటి బొట్టు విలువైనదని, మనం ఇప్పుడు సంరక్షిస్తేనే భవిష్యత్తు తరాలకు సురక్షితమైన నీటి వనరులను అందించగలమని తెలిపారు. ఈ ప్రోగ్రాం లో సుమారు 150 మంది DKW కాలేజీ విద్యార్థినిల ఉద్దేశించి మాట్లాడుతూ.. తడి, పొడి మరియు ప్రమాదకర వ్యర్ధాలను వేరు చేయడం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించి జల స్వచ్ఛత ను కాపాడవచ్చు అని తెలిపారు.

నీటి వనరులను కాపాడటం ప్రతి పౌరుని బాధ్యతగా భావిస్తూ, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నీటి వినియోగాన్ని తగ్గించడం, వృథా నివారణ, చెరువులు, కుంటలు, సరస్సుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వాడిన నీటిని (Greywater) సరైన విధంగా శుద్ధి చేసి పార్కులు, ఫ్లషింగ్ వంటి అవసరాలకు ఉపయోగించాలని, సోక్ పిట్స్, సమర్థవంతమైన డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

రైన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, పునరుద్ధరించి సమర్థవంతంగా అమలు చేయాలి. శుద్ధి చేసిన నీటిని మళ్లీ వినియోగించడం ద్వారా నీటి కొరత సమస్యను తగ్గించవచ్చని చెప్పారు. శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ మరియు నీటి వనరుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం కావాలని సూచించారు.

నీటి ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అంతేకాకుండా జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్స్, పోలీస్ కార్యాలయాల నందు జలం-జీవం మరియు Save Water - Save Life కాన్సెప్ట్ గురించి తెలిపి, స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (SASA) ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి.తో పాటు AR DSP చంద్రమోహన్ , SB-2 CI శ్రీనివాస రెడ్డి, PCR CI భక్తవత్సల రెడ్డి, RI MT హరిబాబు, RSI లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story