Rajole: నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించాలని వ్యాపారుల నిర్ణయం!

Rajole: యూపీఐ చెల్లింపుల చార్జీలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న నో యూపీఐ డే నిర్వహించనున్నట్లు వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.

PRABHU, RAZOLE
Published on: 27 Sept 2026 4:50 PM IST
Rajole
X

Rajole: నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించాలని వ్యాపారుల నిర్ణయం!

Rajole: UPI చెల్లింపులపై విధించే MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు అక్టోబర్ 2న ‘NO UPI DAY’ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

ఈ సందర్భంగా దుకాణాల్లోని క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులను బ్లాక్ క్లాత్‌తో కప్పి, యూపీఐ స్కానింగ్, డిజిటల్ చెల్లింపులను స్వీకరించకుండా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రజలకు ముఖ్య సూచన

ఆ రోజు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అయితే అన్ని దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరిగా నిలిచిపోతాయని నిర్ధారణ లేదు. కాబట్టి మీ ప్రాంతంలోని వ్యాపారుల నుంచి ముందస్తు సమాచారం తెలుసుకోండి.

వ్యాపారుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE