O.D. Cheruvu: అడ్మిషన్ల పెంపునకు ఉపాధ్యాయుల నడుం.. ఇంటింటికీ తిరిగి అవగాహన
O.D. Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి. చెరువు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
O.D. Cheruvu: అడ్మిషన్ల పెంపునకు ఉపాధ్యాయుల నడుం.. ఇంటింటికీ తిరిగి అవగాహన
O.D. Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా, ఓ.డి. చెరువు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీధులలో ర్యాలీ చేపట్టి, ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అభ్యర్థించారు.
ర్యాలీ సందర్భంగా తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజన పథకం, ప్రతినెల ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తూ,
వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




