Ongole: వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోరం.. ఒంగోలు వైసీపీ ఆఫీసులోనే ఇరు వర్గాల పరస్పర దాడి!

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోర కలకలం రేగింది.

Arun Chilukuri
Published on: 8 July 2026 4:07 PM IST
Ongole
X

Ongole: వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోరం.. ఒంగోలు వైసీపీ ఆఫీసులోనే ఇరు వర్గాల పరస్పర దాడి!

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ శ్రేణులు ఘర్షణకు పాల్పడ్డారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు పరిస్పరం దాడికి చేసుకున్నారు. ఎస్టీసెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మరో మహిళ నేత మేరి తన భర్త శ్రీనుతో కలిసి ప్రసన్నపై దాడి చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైసీపీ జిల్లా నేతలు జోక్యం చేసుకున్నారు. మేరి, పేరం ప్రసన్న మధ్య గతంలోనే వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పార్టీ కార్యాలయంలో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story