Parvathipuram Manyam: పాలకొండలో చెత్త రచ్చ.. కమిషనర్ వాహనాల ముట్టడి!

Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చెత్త వాహనాలను అట్టలి గ్రామస్తులు అడ్డుకున్నారు.

KAILASH SAHU, PALAKONDA
Published on: 16 April 2026 1:25 PM IST
Parvathipuram Manyam
X

Parvathipuram Manyam: పాలకొండలో చెత్త రచ్చ.. కమిషనర్ వాహనాల ముట్టడి!

పార్వతీపురం మన్యం జిల్లా: మన్యం జిల్లా పాలకొండ నగరపంచాయితీ చెత్త తరలించే వాహనాలను అట్టలి గ్రామస్తులు గ్రామకూడలి వద్ద గఅడ్డగించారు. నగరపంచాయితీ పరిధిలోని చెత్తను తమ గ్రామం వద్ద డంపింగ్ చెయ్యడాన్ని నిరసిస్తూ నగరపంచాయితీ వాహనాల ఎదురుగా బైటాయించారు. దీనితో పరిస్థితి అదుపు తప్పుతుందని తెలుసుకున్న నగరపంచాయితీ కమీషనర్ హుటాహుటిన ఘటన జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేసారు. ప్రస్తుతానికి చెత్త డంపింగ్ చెయ్యకుండా ఆపుతామని మొత్తం శుభ్రం చేయిస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story