Palakonda: ఆకర్షణలకు లోనుకావద్దు.. చదువుపై దృష్టి పెట్టండి
Palakonda: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ టౌన్ మరియు సీతంపేట మండలం హడ్డుబంగి పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Palakonda: ఆకర్షణలకు లోనుకావద్దు.. చదువుపై దృష్టి పెట్టండి
Palakonda: పాలకొండ టౌన్ నందు ఉన్నటువంటి గవర్నమెంట్ బాలికల కళాశాల నందు మరియు సీతంపేట మండలం Haddubangi gtwah స్కూల్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమo చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాలకొండ SDPO గారు హడ్డుబంగి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థినులు ఎటువంటి ఆకర్షణలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించాము.
చదువుపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి.
ప్రత్యేకంగా అమ్మాయిలు తమ భద్రతపై జాగ్రత్తగా ఉండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మరియు శక్తి యాప్ ఉపయోగం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలు చేయడం వల్ల నష్టాలు గురించి మరియు సెల్ఫ్ ఆత్మ రక్షణ కొరకు కొన్ని కరాటే నేర్చుకోవాలని వివరించారు హెల్ప్ లైన్ నెంబర్స్ -పోలీస్112, సైబర్ క్రైమ్ 1930, మాదక ద్రవ్యాలు 1972, చిన్నపిల్లల హెల్ప్ లైన్1098 ,
గురించి చెప్పడం జరిగింది, 18 సంవత్సరాలలోపు బాల బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, చిన్నపిల్లలపై జరుగు లైంగిక దాడుల గురించి జాగ్రత్త ఉండాలని, ఎటువంటి అట్రాక్షన్ కి గురికాకుండా ఉండాలని, అపరిచితుడు వ్యక్తులు కు దూరంగా ఉండాలని, అని అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీస్పీ గారితో పాటు సీతంపేట si గారు, వారి సిబ్బంది, శక్తి టీం సిబ్బంది మరియు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




