Palakonda: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!

Palakonda: పాలకొండ సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమీక్షా సమావేశం జరిగింది.

KAILASH SAHU, PALAKONDA
Published on: 18 April 2026 7:06 PM IST
Palakonda
X

Palakonda: రేషన్ పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు!

Palakonda: పాలకొండ సబ్ కలెక్టర్ గారు సీడీఎస్‌టీలతో పాటు పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మరియు భామిని మండలాల రేషన్ షాప్ డీలర్లతో సీతంపేట ఐటిడిఏ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారు నిత్యావసర సరుకుల సమయానికి సరఫరా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా విక్రయాలు, సరుకుల నాణ్యత పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

అలాగే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story