Road Accident: పల్నాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం!
Road Accident: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident: పల్నాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం!
Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలం బోయపాలెం దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు ఉన్నారు. సమాచారం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపు చేశారు. ఆగి ఉన్న లారీ చిలకలూరిపేట నుంచి గుంటురు వెళ్తుంది. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story




