Martur: పసికందుకు అండగా ఎమ్మెల్యే ఏలూరి!
Martur: బాపట్ల జిల్లా మార్టూరులో నెలలు నిండని పసికందుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. సీఎం సహాయ నిధి ద్వారా రూ.1,50,144 ఆర్థిక సాయం అందజేత.
Martur: పసికందుకు అండగా ఎమ్మెల్యే ఏలూరి!
Martur: కడుపులో బిడ్డ కదలికలు మొదలైనప్పటి నుంచి ఆ తల్లిదండ్రుల కళ్లలో వెయ్యి కలలు. కానీ నెలలు నిండకుండానే బిడ్డ జన్మించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కంగారు పడింది. మార్టూరు మండలం, మార్టూరు గ్రామానికి చెందిన చుండి జయప్రకాష్, చాందిని దంపతులకు ఐదు రోజుల క్రితం మగశిశువు జన్మించాడు.
వైద్యుల సూచన మేరకు నవజాత శిశువును చిలకలూరిపేటలోని వరలక్ష్మి ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఒకవైపు బిడ్డ ఆరోగ్యం కోసం తల్లడిల్లుతూనే, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులను తలచుకుని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న తపనతో వారు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆశ్రయించారు. కుటుంబ ఆవేదనను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సాంబన్న ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌వోసీ ద్వారా రూ.1,50,144 చెక్కును తక్షణమే మంజూరు చేయించి, స్వయంగా బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. ఎమ్మెల్యే సాంబన్న సహాయంతో తమ బిడ్డకు మెరుగైన చికిత్స అందుతుందన్న భరోసాతో ఆ కుటుంబం ఎమ్మెల్యే ఏలూరికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నాయకులు ఆ చెక్కును కుటుంబ సభ్యులు అందజేశారు.




