Parvathipuram: డ్రగ్స్ రహిత మన్యం జిల్లా.. 'అభ్యుదయం 2.0' ప్రత్యేక అవగాహన
Parvathipuram: డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా 'అభ్యుదయం 2.0' కార్యక్రమం ప్రారంభం.
Parvathipuram: డ్రగ్స్ రహిత మన్యం జిల్లా.. 'అభ్యుదయం 2.0' ప్రత్యేక అవగాహన
Parvathipuram: విశాఖపట్నం రేంజ్ ఐజి గోపినాధ్ జెట్టి ఆదేశాలతో మన్యం జిల్లా పాలకొండ డిఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అభ్యుదయం 2.0 ను ప్రారంభించారు. మన్యం జిల్లా వ్యాప్తంగా డ్రగ్ అవేర్నెస్ కాంపెయిన్ ను పటిష్టంగా నిర్వహించాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా పాలకొండ రేంజ్ డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ డ్రగ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపే క్రమంలో భాగంగా విశాఖపట్నం జోన్ ను మొదటి స్థానంలో నిలపాలని ఐజీ గోపినాధ్ జెట్టి దృఢ సంకల్పంతో ఉన్నారని, ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 40 రోజులపాటు జరిగే ఈ అభ్యుదయం 2.0 కార్యక్రమం ద్వారా ప్రజలలో డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలపై చైతన్యం తీసుకువచ్చి ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల నుండి డ్రగ్స్ సరఫరా కట్టడి చేయడంతో పాటు రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు.




