Pathapatnam: నకిలీ గిరిజన పత్రాలపై ఉక్కుపాదం మోపాలి

Pathapatnam: శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆదివాసీ జేఏసీ (JAC) ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిగింది.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 19 April 2026 5:57 PM IST
Pathapatnam
X

Pathapatnam: నకిలీ గిరిజన పత్రాలపై ఉక్కుపాదం మోపాలి

Pathapatnam: పాతపట్నం ఆదివాసి భవనంలో ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నా టెక్కలి, నందిగాం, సారవకోట, హిరమండలం, కొత్తూరు, మందస, సోంపేట, కంచిలి, పాతపట్నం, సరుబుజ్జిలి,బూర్జ, హిరమండలం,జలుమూరు, మండలాల్లో ఉన్న సంఘాలు ఆదివాసి సంక్షేమ పరిషత్, ఆదివాసి వికాస పరిషత్, దండ కారణ్య లిబరన్ పార్టీ, ఆదివాసి ఉద్యోగ సంఘాలు, ఆలిండియా ఆదివాసి ఉద్యోగ సంఘాలు, గిరిజన సేవ సంగం,సమావేశం అయ్యాయి.

ఈ సమావేశంలో జేఏసీ అధ్యక్షులు సవర.రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసులు ప్రధాన సమస్య నకిలీ గిరిజనలు ఈ సమస్యపై మనమంతా కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ నాయకులు ఓటు బెంక్ రాజకీయాల కోసం మిగతా కులాలు గిరిజన జాబితానికి కృషి చేస్తున్నారు తప్ప నిజమైన ఆదివాసి హక్కుల కోసం ఒక్క రాజకీయ నాయకులు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం కనుక మనమంతా కలిసి భావితరాల భవిష్యత్తు కోసం మన ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేయడం చాలా అవసరం ఉంది అన్నారు.

జేఏసీ ప్రధాని కార్యదర్శి గురడి. అప్పన్న మాట్లాడుతూ జిల్లాలోని ఉన్నా ఆదివాసి సంఘాలన్ని ఒక తాటిపై వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటూ మన శ్రీకాకుళం జిల్లాలో 35 ఏళ్ళ నుండి సుమారుగా రెండు వందల పైగా నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారు.ఈనకిలీ ఉద్యోగస్తులపై ఎప్పటికీ అనేక సంఘాలు ఫిర్యాదు చేశాయి.

జిల్లా అధికారులు డి.యల్.సీ లో విచారణ చేస్తున్నారు తప్ప ఇంత వరకు నకిలీ గిరిజన ఉద్యోగస్తులపై ఇంత వరకు పూర్తిగా చర్యలు తీసుకోలేదు కనుక మనమంతా కలిసి హైకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం అలాగే ప్రజా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అప్పన్న అన్నారు. జేఏసీ సలహాదారులు సవర జగన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసి హక్కులు మనం రక్షించాలన్నా మనం అనుభవిస్తున్న ఈ ఆరు శాతం రిజర్వేషన్ మన భావితరాలికి అందించాలన్న మనం ఐక్యతతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మన శ్రీకాకుళం జిల్లాలో నకిలీ గిరిజనుల సమస్య జిల్లాకి పరిమితం చేయకుండా ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయల్సిన అవసరం ఉంది కనుక రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి మంత్రులకు మరియు ప్రతిపక్ష నాయకులకు వినతి పత్రం అందించాలని అన్నారు. ఆదివాసి జేఎసి మహిళా అధ్యక్షురాలు మల్లిపురం. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ,

జిల్లాలో అధికారులు మరియు ఐటీడీఏ పీవో ఈ నకిలీ గిరిజన ఉద్యోగస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంతకాలం ఇలా విచారణ పేరుతో కాలయాపన చేస్తారని ఈ అధికారులు ఎవరికోసం ఎవరికోసం పనిచేస్తున్నారని ప్రశ్నించారు. నిజమైన గిరిజనుల కోసమా లేక గిరిజనేత్రాల కోసమా ఉద్యోగాలు చేస్తున్నారా ఈ ఆదివాసీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా అధికారులు ఉన్నది అని అన్నారు.

ఈ జేఏసీ సమావేశంలో అన్ని సంఘాలు ఏక అభిప్రాయనికి వస్తు 2022 సంవత్సరంలో ఏర్పాటుచేసిన ఆదివాసీ జేఏసీ కొనసాగుతుందని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ.యోగి, పెద్దింటి.నేపాల్, ఆదివాస వికాస్ పరిషత్ జిల్లా అధ్యక్షులు సవర.జగన్,

ఆల్ ఇండియా ఆదివాసి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రావు, డి.యల్.ఓ.సవర.కుమార్, సవర.గణేశ్వరావు, బిసిరింగి. సింహాచలం, మళ్లీపురం.శ్రీను, అజారి.రామారావు, బైదలాపురం.సింహాచలం,బెజ్జి. ప్రసాద్, సవర.దేవేంద్ర రావు, జన్ని. శ్రీను, వెంకటేష్ మాజీ సర్పంచ్, గణేష్ ఆదివాసి సంక్షేమ పరిషత్ మెలియాపుట్టి మండల అధ్యక్షులు, సుందరడ.తవిటి నాయుడు,యవ్వారం.సుజాతజన్ని. బింజన్న, గుమ్మడి. నారాయణ రావు, గురడి. సోమేశ్, జంజిక.బాలు, తదితరులు పాలుగున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story