అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు: కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు!
తూర్పుగోదావరి జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రామచంద్రరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తులు: కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు!
అంతర్వేది/సఖినేటిపల్లి: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో కొలువైవున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని పాట్నా హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, త్రిపుర హైకోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రామచంద్రరావు లు కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తులకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనం అందజేశారు. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, రెవెన్యూ, పోలీసు, కోర్టు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం.కే.టి.ఎన్.వి. ప్రసాద్ తెలిపారు.




