Pawan Kalyan Divorce: పవన్ విడాకుల వెనుక అసలు నిజం ఇదేనా?.. వేణుస్వామి పాత వీడియో వైరల్!

Pawan Kalyan Divorce: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ - అన్నా లెజ్నెవా దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు వచ్చిన అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2026 11:48 AM IST
Pawan Kalyan Divorce
X

Pawan Kalyan Divorce: పవన్ విడాకుల వెనుక అసలు నిజం ఇదేనా?.. వేణుస్వామి పాత వీడియో వైరల్!

Pawan Kalyan Divorce: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆయన భార్య అన్నా లెజ్నెవా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు వచ్చిన అధికారిక వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విడిపోయినప్పటికీ తాము మిత్రులుగా కొనసాగుతామని, తమ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులుగా బాధ్యతలను నెరవేరుస్తామని వారు స్పష్టం చేశారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే పవన్ - అన్నా లెజ్నెవా దంపతులు ఉన్నట్టుండి విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ప్రకటన రావడం పవన్‌స్టార్ అభిమానులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. గతంలో పవన్ తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ముంబై ఆసుపత్రి చికిత్స అనంతరం అన్నా లెజ్నెవా కాలి నడకన తిరుమలకు కూడా వెళ్లారు. పవన్ కోసం ఆమె హిందూ మతాన్ని కూడా స్వీకరించారు. అయితే, ఇటీవల పవన్ కేరళలో 25 రోజుల పాటు ఆయుర్వేద చికిత్స తీసుకున్న సమయంలో ఆమె దూరంగా ఉన్నారు. అలాగే అక్టోబర్‌లో అన్నా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడంపై ఇప్పటికే అనేక ఊహాగానాలు రాగా, తాజాగా వచ్చిన విడాకుల వార్తతో వాటన్నింటికీ స్పష్టత వచ్చినట్లయింది.

ఈ విడాకుల వ్యవహారం అధికారికంగా వెలుగులోకి వచ్చిన వెంటనే సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామికి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సరిగ్గా మూడేళ్ల కిందట పవన్ కళ్యాణ్ జాతకం చూసి ఆయన నాలుగో పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యల వీడియోను ఇప్పుడు ఆయన మళ్లీ ఫేస్‌బుక్‌లో రీపోస్ట్ చేశారు.

వేణుస్వామి వీడియోను కోట్ చేస్తూ నెటిజన్లు, పవన్ వ్యతిరేకులు తీవ్ర స్థాయిలో చర్చలు మొదలుపెట్టారు. నాలుగో పెళ్లి ఆలోచన లేకపోతే విడాకులు ఎందుకు తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పవన్ విడాకుల అంశం కాస్త 'పవన్ వర్సెస్ వేణుస్వామి' వివాదంగా మారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.