Pawan Kalyan: విజయ్ చాలా సమర్థుడు.. ఆయనకు సలహాలు ఇవ్వను: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan: తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 13 April 2026 4:24 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: విజయ్ చాలా సమర్థుడు.. ఆయనకు సలహాలు ఇవ్వను: పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ యువతతో నిర్వహించిన ‘జనసేనాని విత్‌ జెన్‌జీ’ (Jansenani with Gen-Z) కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన స్టార్ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు మీరు ఇచ్చే సలహా ఏంటి అన్న ప్రశ్నకు పవన్ తనదైన శైలిలో స్పందించారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?

"నేను సాధారణంగా ఎవరికీ సలహాలు ఇవ్వను. చివరికి నా పిల్లల విషయంలో కూడా అలాగే ఉంటాను. విజయ్ విషయానికొస్తే.. ఆయన చాలా సమర్థుడు మరియు చాలా పెద్ద స్టార్. ఆయనకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను" అని పవన్ పేర్కొన్నారు.

రాజకీయాల్లో రాణించాలంటే ఫలితాన్ని ఆశించకుండా కష్టపడాలని విజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూనే, తన సొంత రాజకీయ ప్రస్థానాన్ని కూడా పవన్ గుర్తు చేసుకున్నారు.

ఒకవేళ మీరు రాజకీయాల్లో లేకపోయి ఉంటే.. ఏ అంశంపై కంటెంట్ క్రియేట్ చేసేవారు? అన్న ప్రశ్నకు సమాధానంగా.. తాను దేశభక్తి మరియు ప్రకృతి పరిరక్షణ అంశాలపై వీడియోలు చేసేవాడినని పవన్ కళ్యాణ్ వివరించారు.

ఈ కార్యక్రమంలో యువత అడిగిన అనేక వైవిధ్యమైన ప్రశ్నలకు పవన్ ఎంతో ఓపిగ్గా, స్పష్టతతో సమాధానాలిచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ వైరల్‌గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story