తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. ‘మావిగన్’ ప్రచారంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ!

Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 8 July 2026 2:52 PM IST
తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. ‘మావిగన్’ ప్రచారంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ!
X

తిరుపతిలో వైఎస్సార్‌కు నివాళి.. ‘మావిగన్’ ప్రచారంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ!

Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. వైయస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మావిగన్ వల్ల వెనుకబడి ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతుందని పెద్దిరెడ్డి అన్నారు. మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. మావిగన్ పై అసంతృప్తి చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. దోచిపెట్టడానికి వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అమరావతి పేరుతో నీళ్ళలో పడేస్తున్నారని దాని వల్ల ప్రయోజనం లేదన్నారు.

మావిగన్ ఇష్టం లేక మా పార్టీ నేతలు మారుతారన్నది చంద్రబాబు, ఆయన‌ కోటరీ చేస్తున్న ప్రచారం మాత్రమేనని అదోక పిచ్చి ప్రేలాపన అని పెద్దిరెడ్డి అన్నారు. ప్రజల కోసం బతికిన వ్యక్తి వైఎస్ ఆర్ చనిపోయిన ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్య శ్రీ తీసుకుని వచ్చిన ఘనత వైఎస్ ఆర్‌ది అన్నారు. జలయజ్ఞం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు..నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పధకం ఒక వరమన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story