Sakhinetipalli: ఆక్వా రైతుల పోరుబాట రొయ్యల మేత, ఇంధన ధరలపై సీపీఐ నిరసన

Sakhinetipalli: సీపీఐ నేత రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

PRABHU, RAZOLE
Published on: 20 May 2026 3:07 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: ఆక్వా రైతుల పోరుబాట రొయ్యల మేత, ఇంధన ధరలపై సీపీఐ నిరసన

సఖినేటిపల్లి: పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ఇప్పటికే అధిక జీవన వ్యయంతో సతమతమవుతున్న మధ్యతరగతి,పేద కుటుంబాలతో పాటు వివిధ రంగాలపై మరింత భారం మోపాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా.. సీపిఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ అన్నారు. సీపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆక్వా రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎక్కడో జరుగుతున్న యుద్దాన్ని బూచీ గా చూపించి,యుద్ధ ప్రభావం మన దేశంపై పెద్దగా లేకపోయినప్పటికీ దేశ వ్యాప్తంగా రూ.3 లు పైబడి ఇంధన ధరలను పెంచడం సమంజసం కాదన్నారు. అలానే ఏపిలో సాగుబడి లేక ఇప్పటికే కుదేలౌతున్న ఆక్వా రైతులు పై భారం పడే విధంగా రొయ్య మేతను కేజీకి రూ.10 లు చొప్పున పెంచడం చాలా దారుణం అన్నారు.

పెంచిన ఇంధన ధరలను, రొయ్య మేత ధరలను తక్షణమే తగ్గించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గెడ్డం ప్రభాకర్ రావు, రమేష్ రాజు,దొంగ యేసు,చెల్లుబోయిన తాతారావు,చిట్టి రాజు,ఆకన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story