Nellore: రోడ్డు ప్రమాద బాధితులకు వరం పీఎం రాహత్!
Nellore: నెల్లూరు మెడికవర్ హాస్పిటల్‌లో పీఎం రాహత్ పథకం ప్రారంభమైంది. రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.50 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది.
Nellore: రోడ్డు ప్రమాద బాధితులకు వరం పీఎం రాహత్!
Nellore: రోడ్డు ప్రమాద బాధితులకు వరం..పీఎం రాహాత్ పథకం అని అన్నారు మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి. రంజిత్ రెడ్డి ఈరోజు మెడికవర్ హాస్పిటల్ లో రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని , వారికి వెంటనే చికిత్స అందించి.. మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చిందని, సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో వుంటుంది అని జిల్లా అడిషనల్ SP సౌజన్య తెలిపారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందని, ప్రమాదం జరిగిన, మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుందని చెప్పారు..
ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారని, అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుందని, చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుందని. బాధితుడు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుందని చెప్పారు.
రాహాత్-వీర్ ప్రోత్సాహకం
ప్రమాద సమయంలో సహాయం చేసి గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన వారికి రాహాత్-వీర్‌గా గుర్తింపు ఇస్తారని, వారికి రూ.25 వేల నగదు బహుమతి, ప్రత్యేక సర్టిఫికేట్ అందిస్తారని చెప్పారు.
పీఎం రాహాత్ పథకం జిల్లాలో నేటి నుంచి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ప్రారంభం అయిందని, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఏ. లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమం లో DSP గట్టమనేని శ్రీనివాసులు, రూరల్ CI వేణు, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్ పాల్గొన్నారు.




